మట్టపల్లి క్షేత్రంలో నిత్య కల్యాణం

మట్టపల్లి క్షేత్రంలో నిత్య కల్యాణం

SRPT: మట్టపల్లి క్షేత్రంలో బుధవారం సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, మూలవిరాట్ కు పంచామృతాభిషేకం చేశారు. అనంతరం శ్రీసామి అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం జరిపి కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను గరుడ వాహనంపై ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు.