ఇందుకూరుపేటలో గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

ఇందుకూరుపేటలో గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన

NLR: ఇందుకూరుపేట పట్టణంలోని స్థానిక గ్రంథాలయంలో వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం గ్రంధాలయంలో పుస్తక ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వివిధ రకాల కథల పుస్తకాలను విద్యార్థులు ఎంతో ఆసక్తిగా తిలకించారు. వివిధ రకాల పుస్తకాలను చదివి తద్వారా విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని గ్రంథాలయ అధికారి ఆర్. నాగరాజ్ సూచించారు.