ఐపీఎల్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు: ఎస్సై శివకుమార్ హెచ్చరిక
అన్నమయ్య: రామాపురం మండలంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్‌లపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై శివకుమార్ హెచ్చరించారు. యువత క్రికెట్‌ను ఆనందంగా చూడాలి కానీ, బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. బెట్టింగ్‌లకు అలవాటు పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. బెట్టింగ్ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.