సీఎంను కలిసిన జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డ్ ఛైర్మన్
HYD: జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని జాతీయ పాడి పరిశ్రమ అభివృద్ధి బోర్డు ఛైర్మన్ డాక్టర్ మీనేష్, మదర్ డెయిరీ ఢిల్లీ ఛైర్మన్ జయతీర్థ చారి మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకోవలసిన అంశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో ఎంపీ చామల కిరణ్ కుమార్, మదర్ డెయిరీ ఛైర్మన్ మధుసూదన్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.