గవర్నర్ బంగ్లాలో విద్యాసాగర్ సంగీత కచేరీ.. గవర్నర్ అభినందన

గవర్నర్ బంగ్లాలో విద్యాసాగర్ సంగీత కచేరీ.. గవర్నర్ అభినందన

SKLM: దీపావళి సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన వేడుకల్లో బంకుపల్లి వెంకట విద్యాసాగర్ సంగీత కార్యక్రమం ఆకట్టుకుంది. కార్యక్రమం అనంతరం గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, విద్యాసాగర్‌ను అభినందించి ఆశీస్సులు అందజేశారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో సంగీత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న విద్యాసాగర్, గవర్నర్ ఆశీస్సులు అందుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.