'జిల్లా కోపరేటివ్ సొసైటీ ఎన్నికలలో సత్తా చాటాలి'
VZM: త్వరలో జరుగనున్న జిల్లా కోపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచి సత్తా చాటాలని టీడీపి రాష్ట్ర కార్యదర్శి కిమిడి మల్లిక్ నాయుడు సూచించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 15 PACS అధ్యక్షులు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు, సభ్యులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు.