ప్రభుత్వ ఆసుపత్రులపై విశ్వాసం పెంచాలి: కలెక్టర్
WGL: కలెక్టర్ ఛాంబర్‌లో ఎంజీఎం, సీకేఎం, నర్సంపేట, వర్ధన్నపేట ఆసుపత్రుల అడ్మిన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డా. సత్యశారద మాట్లాడుతూ.. ప్రజల్లో ప్రభుత్వ ఆసుపత్రులపై నమ్మకం పెరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మౌలిక వసతులు, ఔషధాల లభ్యత, వైద్య సిబ్బంది పనితీరు, పరిశుభ్రత పై ప్రత్యేక దృష్టి సహకరించాలని అధికారులకు ఆదేశించారు.