ఎరువుల దుకాణంలో తనిఖీలు.. గోదాం సీజ్

ఎరువుల దుకాణంలో తనిఖీలు.. గోదాం సీజ్

PPM: పాలకొండ పట్టణంలో ఎరువుల దుకాణాలను విజిలెన్స్ అధికారులు మంగళవారం రాత్రి తనిఖీ చేశారు. అనధికారంగా ఉన్న గోదాంలో రికార్డుల్లో కన్నా అధికంగా ఎరువులు బస్తాలు ఉన్నట్టు గుర్తించామని, ఆ గోదామును సీజ్ చేసినట్టు విజిలెన్ సీఐ రవి ప్రసాద్ తెలిపారు. అదే విధంగా ఈ పాస్ లేకుండా ఎరువులను విక్రయించారని, దానిపై కేసు నమోదు చేశామన్నారు.