దేశవ్యాప్త సమ్మె పోస్టర్ విడుదల

దేశవ్యాప్త సమ్మె పోస్టర్ విడుదల

VZM: కొత్తవలస మండల కేంద్రంలో ఎఐటీసి ఆద్వర్యంలో ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మె పోస్టర్‌ను జిల్లా కార్యదర్శి డేగల అప్పలరాజు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఆ రోజు జరిగే సమ్మెకు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధానాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.