'నష్టపోయిన పంట వివరాలను నమోదు చేయాలి'
మహబూబాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల శనివారం బయ్యారం మండలంలోని కొత్తపేటలో వరి సాగు క్షేత్రాలను పరిశీలించారు. రైతులు తాము సాగు చేస్తున్న పంట, తమ వివరాలను యాప్ లో నమోదు చేసుకోవాలని సూచించారు. దీని వల్ల పంట విక్రయాలు సులభతరం అవుతాయని అన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన పంటలను ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే చేస్తామన్నారు.