కాలేజీల ప్రైవేటీకరణపై కోటి సంతకాల సేకరణ
కృష్ణా: వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుమేరకు, కొడాలి నాని ఆధ్వర్యంలో గుడివాడ ముబారక్ సెంటర్‌లో గురువారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు చేపట్టిన ఈ ప్రజా ఉద్యమానికి గుడివాడ నియోజకవర్గ ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుందని పట్టణ అధ్యక్షులు గొర్ల శ్రీను తెలిపారు.