బస్టాండ్‌లో కూలిన హోర్డింగ్.. తప్పిన ప్రమాదం

బస్టాండ్‌లో కూలిన హోర్డింగ్.. తప్పిన ప్రమాదం

కడప ఆర్టీసీ బస్టాండ్‌లో భారీ హోర్డింగ్ బోర్డు ఒక్కసారిగా కింద పడటంతో ప్రయాణికులకు భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో హోర్డింగ్ కింద ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు బస్టాండ్‌పై దృష్టి సారించకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బస్టాండ్‌లో తక్షణమే భద్రతా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.