తోలుకోడులో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

తోలుకోడులో స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం

NTR: మైలవరం మండలం తోలుకోడు గ్రామ శివారులో మంగళవారం ఒక ప్రైవేట్ స్కూల్ బస్సు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. గత ఏడాది వరదలకు కొట్టుకుపోయిన రోడ్డుపై ఏర్పడిన పెద్ద గుంతలో బస్సు పడటంతో ఈ సంఘటన జరిగింది. అదృష్టవశాత్తు, విద్యార్థులను దించి వెళుతున్న సమయంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో ప్రాణనష్టం తప్పింది. సంఘటనతో స్థానికులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు.