'జలవనరుల సమృద్ధి ప్రభుత్వ లక్ష్యం'
కృష్ణా: జలవనరుల సమృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం జలధార కార్యక్రమం చేపట్టిందని కోడూరు డీసీ ఛైర్మన్ బచ్చు రఘునాథ ప్రసాద్ అన్నారు. బుధవారం అవనిగడ్డ మండలం మోదుమూడిలో 'నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత' కార్యక్రమం సందర్భంగా గ్రామంలోని మూడు పంచాయతీ చెరువులు పరిశీలించి అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను గుర్తించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ చంద్రశేఖర్, ఈవో రాంబాబు పాల్గొన్నారు.