ముగ్గురు మృతి.. మాజీ సీఎం దిగ్భ్రాంతి

ముగ్గురు మృతి.. మాజీ సీఎం దిగ్భ్రాంతి

 ASR: అనంతగిరి జలపాతంలో సెల్ఫీ దిగుతూ ప్రమాదవశాత్తు ముగ్గురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై మాజీ సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు మృతుల కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కష్టకాలంలో వారు ధైర్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలు బలోపేతం చేయాలని ప్రభుత్వానికి సూచించారు.