'ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు'

'ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు'

ప్రకాశం: మార్కాపురంలో ప్రతిఒక్కరూ వాహన నిబంధనలు పాటించాలని, ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మార్కాపురం సీఐ ఆవుల వెంకటేశ్వర్లు హెచ్చరించారు. సోమవారం పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని ట్రాఫిక్‌ సమస్యలు, నేరాలు, అసాంఘిక కార్యకలాపాలపై వారికి అవగాహన కల్పించారు.