విద్యార్థులతో మంత్రి డోలా వీడియో కాన్ఫరెన్స్

విద్యార్థులతో మంత్రి డోలా వీడియో కాన్ఫరెన్స్

AP: పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు మంత్రి DSBV స్వామి దిశానిర్దేశం చేశారు. ప్రకాశం, మార్కాపురం జిల్లాలోని సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. పరీక్షల పట్ల భయం పోగొట్టేలా విద్యార్థుల్లో ధైర్యం నింపారు. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా రాయాలని సూచించారు. కాగా, మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి.