అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య
MHBD: పంట నష్టపోయి, అప్పుల బాధతో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిన్నకిష్టాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని అడ్డాస్‌కుంట తండాలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన భోజ్య రెండున్నర ఎకరాల భూమిలో మొక్కజొన్న సాగు చేయగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పాడైంది. పంటకోసం రూ.3 లక్షల వరకు అప్పు చేయగా, దానిని ఎలా తీర్చాలన్న మనోవేదనతో పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.