మారేడు దళములతో పూజలందుకున్న స్వామివారు

మారేడు దళములతో పూజలందుకున్న స్వామివారు

VSP: కొమ్మాది వైఎస్సార్ కాలనీలోని శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామివారి ఆలయంలో మూడో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. వేకువజామున భక్తుల రద్దీతో ఆలయం కిటకిటలాడింది. ప్రధాన అర్చకుడు బ్రహ్మశ్రీ గరిమెళ్ళ శ్రీకాంత్ శర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు, విశేష అర్చనలు నిర్వహించారు. సాయంత్రం సహస్ర బిల్వార్చన, పంచహారతి, నక్షత్ర హారతులను స్వామివారికి నిర్వహిస్తామన్నారు.