బాధితుడిని పరామర్శించిన ఏలేటి

NRML: రూరల్ మండలం ముఖి గ్రామానికి చెందిన రాజేశ్వర్ కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడి సికింద్రాబాద్ యశోధ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి బుధవారం ఆసుపత్రికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నాడు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఈయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.