రూ.2 కోట్లతో బీటీ రోడ్డు పనులు ప్రారంభం
VKB: రుద్రారం నుంచి పాటిమీదిపల్లి మీదుగా గొటికె శివారు వరకు బీటీ రోడ్డు ఏర్పాటుతో మూడు దశాబ్దాల కల నెరవేరిందని కాంగ్రెస్ మండల వర్కింగ్ ప్రసిడెంట్ ఆనంద్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ అంబయ్య గౌడ్, సర్పంచ్ ఎల్లప్ప, మాజీ సర్పంచ్ సాయిలు హర్షం వ్యక్తం చేశారు. రూ.2 కోట్లతో రోడ్డు పనులను ఇవాళ ప్రారంభించారు.