VIDEO: ఈనెల 7 నుండి ఆరాధన ఉత్సవాలు

ప్రకాశం: కనిగిరి లోని శ్రీ దొంతులమ్మ ఆలయంలో కొలువైన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో స్వామివారి ఆరాధన మహోత్సవాలు ఈనెల 7నుండి 11వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యదర్శి ఎం మాలకొండయ్య తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 7న మహా సమాధి, 9న 108 కళాశాలతో ఊరేగింపు, 11న పొంగళ్ల కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాలు విజయవంతం చేయాలన్నారు.