నదిలోకి చేపల వేటకు వెళ్లొద్దు: తహసీల్దార్
GNTR: ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో కృష్ణానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో రాయపూడి పెదలంక, ఉద్దండరాయునిపాలెం, తాళ్ళాయపాలెం లంక గ్రామస్థులు నదిలో దిగవద్దని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని తహసీల్దార్ హరిబాబు సూచించారు. మంగళవారం ఆయన లంక గ్రామాల వద్ద ప్రవాహ ఉద్ధృతిని పరిశీలించారు. కావున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.