సూర్యప్రభ వాహనంపై నరసింహస్వామి దర్శనం
సత్యసాయి: కదిరిలోని ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు ఇవాళ ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ మాడ వీధుల్లో జరిగిన ఈ తిరువీధి ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.