కంబదూరులో శతాధిక వృద్ధురాలు మృతి

కంబదూరులో శతాధిక వృద్ధురాలు మృతి

ATP: కంబదూరు మండల కేంద్రం ఆర్డీటీ కాలనీకి చెందిన శతాధిక వృద్ధురాలు గంగమ్మ (102) మృతిచెందారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ  తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు ముగ్గురు కుమారులు, చిన్న కుమారుడు గంగాధర వద్ద ఉండేవారు. బంధుమిత్రులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై గంగమ్మ మృతదేహానికి స్వగ్రామంలోనే అంత్యక్రియలు నిర్వహించి ఆమెకు తుది వీడ్కోలు పలికారు.