ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన దుస్తితి..!

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వెళ్లాల్సిన దుస్తితి..!

మేడ్చల్: పీర్జాదిగూడలోని విష్ణుపురి కాలనీలో ఇళ్లల్లోకి వరద నీరు భారీగా చేరింది. ఒక్కసారిగా ఎగువ నుంచి వర్షపు నీరు కాలనీలోకి చేరడంతో పూర్తిగా జలదిగ్బంధం అయింది. బయటకి రావాలంటేనే ప్రజలు జంకుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో బయటికి వెళ్లిన ఓ మహిళ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇంటికి వెళ్లింది.