సమన్వయంతో ప్రధాని విశాఖ టూర్ సక్సెస్

VSP: అధికారులందరూ సమన్వయంతో పనిచేసి విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనను విజయవంతం చేశారు. దాదాపుగా రెండు వారాల ముందు నుంచి అధికారులు ప్రధాని పర్యటన కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా పోలీస్ శాఖ మరింత అప్రమత్తమై ఈ పర్యటన విజయవంతంలో కీలకపాత్ర పోషించింది. ట్రాఫిక్ నియంత్రణ, వీఐపీల భద్రత తదితర అంశాలను కీలకంగా తీసుకుంది.