రేపు లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా
MNCL: రాష్ట్ర ప్రభుత్వ కార్మిక విధానాలను నిరసిస్తూ సోమవారం హైదరాబాద్‌లో లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట జరిగే ధర్నాను విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ పిలుపునిచ్చారు. ఆదివారం కోటపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. సంక్షేమ బోర్డు నిధులు, పథకాలను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వవద్దని డిమాండ్ చేశారు.