బైరెడ్డిపల్లెలో బాలిక కిడ్నాప్
CTR: తన కుమార్తెను కొందరు యువకులు కిడ్నాప్ చేశారని బైరెడ్డిపల్లి(M) తూర్పుగడ్డకు చెందిన ఓ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 'నా బిడ్డ 9వ తరగతి చదువుతోంది. గతంలో ధర్మపురికి చెందిన యువకులు అమ్మాయిని ఇబ్బంది పెట్టారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశాం. నిన్న రాత్రి మా అమ్మ ఇంట్లో నా కుమార్తె నిద్రపోయింది. అర్ధరాత్రి తర్వాత కనపడ లేదు' అని తల్లి పేర్కొన్నారు.