అరటి పంటను పరిశీలించిన అధికారులు
ATP: గుత్తి మండలం రజాపురం గ్రామంలో రైతులు సాగు చేసిన అరటి పంటను శుక్రవారం ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. అరటికి ధరలు లేకపోవడంతో రైతులు స్వయంగా పంటను నాశనం చేస్తున్నారనే సమాచారంతో ఉద్యాన శాఖ అధికారులు పరిశీలించారు. త్వరలోనే అరటి పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం జరుగుతుందని అధికారులు, రైతులకు సూచించారు.