గర్భిణీలకు పౌష్టికాహారం అందజేత
SKLM: పీఎం సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎచ్చెర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భిణీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు సోమవారం నిర్వహించారు. ప్రతి గర్భిణికి రక్తపరీక్షలు, స్కానింగ్ చేసి అవసరమైన మందులు అందించారు. హైరిస్క్ లక్షణాలు ఉన్న గర్భిణీలకు వైద్యులు ప్రత్యేక సలహాలు అందించారు. అనంతరం 20 మంది గర్భిణీలకు పౌష్టికాహారం అందించారు.