అనంతసాగరం ఇన్‌ఛార్జ్ ఎంపీడీవోగా రామచంద్రయ్య

NLR: అనంతసాగరం ఇన్‌ఛార్జ్ ఎంపీడీవోగా EOPRD రామచంద్రయ్యకు ఉన్నతాధికారులు బాధ్యతలు అప్పగించారు. ఇక్కడ పనిచేస్తున్న ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్ వ్యక్తిగత కారణాలతో జూన్ 15 వరకు సెలవుల్లో ఉన్నారు. రామచంద్రయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. గ్రామాల్లో నెలకొన్న మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.