విజయనగరంలో కేంద్ర బలగాలు కవాతు

విజయనగరం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విజయనగరం పట్టణంలో 2 టౌన్ సీఐ కే రామారావు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, కేంద్ర బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పట్టణంలోని దాసన్నపేట, లెంక వీధి, రాజీవ్ నగర్, సుంకర వీధిలో కేంద్ర బలగాలు కవాతు నిర్వహించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీఐ తెలిపారు.