నేటి నుంచి తాగునీటి సరఫరా బంద్

ELR: కొయ్యలగూడెంలో శ్రీ సత్యసాయి రక్షిత తాగునీటి పథకం సిబ్బంది శుక్రవారం నుంచి సమ్మెకు దిగారు. తొమ్మిది నెలలుగా వేతనాలు అందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పోలవరం, చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల్లోని 170 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోనుంది. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తామని యూనియన్ నాయకులు తెలిపారు.