VIDEO: రథోత్సవానికి పెరిగిన భక్తుల రద్దీ
SDPT: బెజ్జంకిలో శనివారం రథోత్సవ కార్యక్రమం ముగిసిన అనంతరం భక్తుల రద్దీ మరింత పెరిగింది. రథంపై అలంకరించిన ఉత్సవ మూర్తుల విగ్రహాలను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. సుదూర ప్రాంతాల నుంచి తరలివచ్చిన వారు స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకున్నారు. గోవింద నామస్మరణలతో పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడాయి.