బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

బాల్య వివాహాలపై అవగాహన సదస్సు

ELR: నూజివీడులోని యానాదుల కాలనీలో గల అంగన్వాడీ కేంద్రంలో సోమవారం బాల్యవివాహాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. 15వ అదనపు జిల్లా జడ్జ్ నాగ శైలజ మాట్లాడుతూ.. బాల్యవివాహాలు చట్ట విరుద్ధమన్నారు. బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్ళు నిండితేనే వివాహం చేయాలన్నారు. బాలికలు, మహిళలపై దాడులు కొనసాగితే బాధితులకు అండగా కోర్టులు ఉంటాయన్నారు.