'ఎన్నికల గుర్తులు వచ్చేశాయ్'
KMR: నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ పర్వం ముగియడంతో అధికారులు ఎన్నికల గుర్తులను కేటాయించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో భాగంగా ఎంపీడీవో కార్యక్రమంలో ఆదివారం అధికారులు ఎన్నికల గుర్తులను తయారు చేశారు. ఈ నెల 9వ తేదీన సాయంత్రం 3 వరకు అభ్యర్థుల నామినేషన్ ఉపసంహరణ, తర్వాత పోటీ చేసే సభ్యుల చివరి జాబితా విడుదల చేస్తామన్నారు.