అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి

NDL: ఉయ్యాలవాడ మండలం ఆర్. జంబులదిన్నె గ్రామానికి చెందిన గజ్జల శివ నాగమ్మ (82) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. శనివారం ఉదయం ఆమె ఇంట్లో ఉరి వేసుకున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు.