విజయవాడలో ద్విచక్ర వాహనాలు ఢీ.. బైక్ దగ్ధం

విజయవాడలో ద్విచక్ర వాహనాలు ఢీ.. బైక్ దగ్ధం

NTR: విజయవాడ కృష్ణలంక ఫ్లై ఓవర్‌పై సోమవారం ఉదయం బైక్, స్కూటీ ఢీకొన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే.. బైక్‌లో నుంచి మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. బైక్, స్కూటీపై వెళ్తున్న వారికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.