చేపల వేటకు వెళ్లి బాలుడు మృతి

చేపల వేటకు వెళ్లి బాలుడు మృతి

నంద్యాల సమీపంలోని పొన్నాపురం వద్ద విషాదం నెలకొంది. నిన్న చేపల వేటకు వెళ్లి గల్లంతైన సోహెల్ (15) అనే బాలుడు, శుక్రవారం ఉదయం చెక్ డ్యామ్ వద్ద మృతి చెంది కనిపించాడు. ప్రమాదవశాత్తు కాల్వలో మునిగి చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. బాలుడి మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పూర్తి వివరాల తెలియాల్సి ఉంది.