VIDEO: ఉద్రిక్తంగా మారిన ఏబీవీపీ ఆందోళన

VIDEO: ఉద్రిక్తంగా మారిన ఏబీవీపీ ఆందోళన

NZB:పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రాత్రి ఏబీవీపీ నాయకులు కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నాకు దిగారు. అక్కడే బస చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. అనంతరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం ఆపబోమన్నారు.