కాలువల మరమ్మత్తులకు చర్యలు

కాలువల మరమ్మత్తులకు చర్యలు

ఆమదాలవలస పట్టణంలోని 15వ వార్డు గణేష్ నగర్- పాతినవానిపేట ప్రాంతంలో పలు సీసీ కాలువల మరమ్మత్తుల అవసరాన్ని గుర్తిస్తూ గురువారం మున్సిపాలిటీ సిబ్బంది, వార్డు నాయకులు సంయుక్తంగా పరిశీలించారు. కాలువలు దెబ్బతినడంతో నీటి పారుదల సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు తెలియజేశారు. దీంతో అధికారులు పరిస్థితిని సమీక్షించి త్వరలోనే మరమ్మత్తులు చేపట్టాలని నిర్ణయించారు.