ఈతకు వెళ్లి యువకుడు మృతి
HNK: నగరంలోని రెడ్డిపురంకుంటలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మునిగి మృతిచెందాడు. శనివారం సాయంత్రం నీటిలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.