పట్టిసీమ ఫెర్రీ రేవులో మృత దేహం లభ్యం

పట్టిసీమ ఫెర్రీ రేవులో మృత దేహం లభ్యం

ELR: పోలవరం మండలంలోని పట్టిసీమ ఫెర్రీ రేవు వద్ద గోదావరిలో గురువారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న స్టేషన్‌ రైటర్‌ భీమశంకర్‌ మృతదేహాన్ని వెలికి తీయించి, పోస్టుమార్టం నిమిత్తం పోలవరం ఆసుపత్రికి తరలించారు. మృతుడు నీలిరంగు చొక్కా, కాకీ ప్యాంట్‌ ధరించి ఉన్నారని పోలీసులు తెలిపారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు తమకు సమాచారం అందించాలని కోరారు.