ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలి: MP
BHPL: జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన దిశా సమావేశంలో వరంగల్ ఎంపీ, దిశా ఛైర్మన్ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. జిల్లాలో వనరులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకొని అభివృద్ధి సాధించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాలు పెంచాలని, డయాలసిస్ సేవలు త్వరగా అందుబాటులోకి తేవాలని సూచించారు. కార్యక్రమంలో MLA గండ్ర, కలెక్టర్ రాహుల్ శర్మ ఉన్నారు.