మున్సిపల్ కార్మికుల నూతన కమిటీ ఎన్నిక
SDPT: హుస్నాబాద్ మున్సిపల్ కార్మిక సంఘం సమావేశం నిర్వహించారు. పట్టణంలో 113 మంది సభ్యులతో సమావేశం నిర్వహించి నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ గౌరవ అధ్యక్షునిగా కౌన్సిలర్ గాదె పాక రవీందర్, అధ్యక్షునిగా గడిపె సారయ్య, ఉపాధ్యక్షునిగా మంద ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి కొండేటి సతీమ్‌లను ఎన్నుకున్నారు.