“శివంగి ఆత్మీయ పురస్కారం” పొందిన మహిళకు సన్మానం
MLG: జిల్లా పసర గ్రామానికి చెందిన సంధ్యారెడ్డి హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జరిగిన కార్యక్రమంలో “శివంగి ఆత్మీయ పురస్కారం” అందుకున్నారు. కాకతీయ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఘన సన్మానం జరిగింది. వాకర్స్ సభ్యులు ఆమెను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు. ఆమె సమాజ సేవా కార్యక్రమాలు, మహిళల అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు.