లెజెండ్ ఈజ్ బ్యాక్.. సియెర్రా రీ-ఎంట్రీ
టాటా మోటార్స్ ఐకానిక్ కారు సియెర్రా(Sierra) మళ్లీ మార్కెట్‌లోకి రాబోతోంది. 1991లో మొదలై, 2003లో నిలిచిపోయిన ఈ లెజెండరీ కారు.. ఆధునిక ఫీచర్లతో కొత్త రూపంలో తిరిగి వస్తోంది. ఈ కారు ఈనెల 25వ తేదీన విడుదల కానున్నట్లు సంస్థ ప్రమోషనల్ వీడియో విడుదల చేసింది. ఈ కొత్త సియెర్రా.. EV, ICE వెర్షన్లలో అందుబాటులోకి రానుంది. సియెర్రా రీ-ఎంట్రీతో కారు ప్రియులు సంబరపడుతున్నారు.