అనుమతులకు ఈరోజే ఆఖరి

కృష్ణా: చవితి ఉత్సవాల నేపథ్యంలో బందరులో వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి కోరేందుకు సోమవారం చివరి రోజు అని డీఎస్పీ సీహెచ్ రాజా ఆదివారం సాయంత్రం మచిలీపట్నంలో తెలిపారు. వినాయక ఉత్సవాల నిర్వహణకు అనుమతి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన https://ganeshutsav.net వెబ్‌సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరించబడతాయన్నారు.