'పట్టుదలకు, క్రమశిక్షణకు నిలువుటద్దం'
ASR: పట్టుదలకు, క్రమశిక్షణకు భగీరథుడు నిలువుటద్దమని కలెక్టర్ టీ.నిశాంతి కొనియాడారు. ఈ మేరకు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భగీరథ మహర్షి జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ భగీరథ మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసి, గంగను ధరణికి తెచ్చారన్నారు.